Guppedantha Manasu ఆగస్ట్ 30 : రిషిని నేనే రమ్మన్నాను వసుధార అంటూ చెప్పిన ఏంజెల్

by Phanindra |   (  Updated:2023-08-30 08:05:57  IST  )

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Guppedantha Manasu ఆగస్ట్ 30 : రిషిని నేనే రమ్మన్నాను వసుధార అంటూ చెప్పిన ఏంజెల్
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

'ఏంటి ఏంజెల్ పిలిచి ఏం మాట్లాడకుండా ఉన్నావని వసు అంటుంది వసు. ‘అదే నీకు ఎలా చెప్పాలో కూడా అర్ధం కావడం లేదు.. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ రిషి సార్ అసలు బయటపడటం లేదు. తన మనసులో ఏమి ఉందో కూడా తెలీదు. అందుకే నువ్వు సాయం చేస్తావని నిన్ను పిలిచాను’ వసు అని అంటుంది ఏంజెల్. కాస్త దూరం నుంచి రిషి కారు రావడం చూస్తుంది..‘రిషి సార్ ఇక్కడికి వస్తున్నారేంటీ?’ అని కంగారుగా అడుగుతుంది వసు ఏంజెల్‌ని. ‘నేనే రిషిని రమ్మన్నాను వసుధార.. ఈ బాధ భరించడం నా వల్ల కాదు.. ఈ రోజు ఏదొకటి తేలిపోవాలి. నువ్వే నా తరపున ఉండి మాట్లాడి తనని ఎలాగైనా ఒప్పించు వసుధార.. లేదంటే కారణమేంటో చెప్పమను’ అని అడుగుతుంది ఏంజెల్. రిషి వచ్చి వాళ్ల ముందు నిలబడతాడు. ఎందుకు పిలిచావ్ అని ఏంజెల్‌ని అడుగుతాడు.

Next Story