Guppedantha Manasu: వసుధారని తప్పుగా అర్ధం చేసుకున్న మను

by Disha Web Desk 10 |
Guppedantha Manasu: వసుధారని తప్పుగా అర్ధం చేసుకున్న మను
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

నీ బాధని నేను అర్థం చేసుకోగలను . ఇన్ని రోజులు నువ్ ఎవరో కూడా తెలీదు..కానీ, ఇప్పుడు తెలిసింది. అసలు మీకు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి.. మీ మధ్య ఇంత దూరం పెరగడానికి గల కారణం ఏంటో చెబితే నేను పరిష్కరిస్తా అని విశ్వనాథం అంటాడు. మీరు ఏం అనుకోనంటే నేను మనసులో ఉన్నది చెబుతా.. నన్ను క్షమించండి సార్. నేను మీతో ఇప్పుడు ఏం మాట్లాడలేను అని మను అంటాడు. అయ్యో అలా అంటావేంటి.. నువ్ మాట్లాడకపోతే మాకెలా తెలుస్తుంది అని విశ్వనాథం అంటాడు. సమస్యకు కారణం ఎవరో వాళ్ల ద్వారానే తెలుస్తుంది అని చెప్పబోతుంటే మను వెళ్ళిపోతాడు.. అదే సమయంలో ఏంజెల్, వసుధార ఆపాలని చాలా ప్రయత్నం చేస్తారు.

ఇదేనా మీరు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం. మీరు ఒకమాట చెప్పగానే ఏమి ఆలోచించకుండా వచ్చేశాను.. మీ మీద గౌరవంతో అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు మను. సారీ వసుధార. నేను నీకు చెప్పడం వల్లే కదా మనును ఇక్కడికి తీసుకొచ్చావ్. కానీ, ఇప్పుడు నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నాడని ఏంజెల్ అంటుంది. నేను అనుకున్నట్లే మను గారు హర్ట్ అయ్యారు. అది నేను చూసుకుంటానులే. మంచి రోజులు వస్తాయి.. మీరేం బాధపడకండి. ఆరోగ్యం జాగ్రత్త .. ఏదో ఒకరోజు అందరూ కలుస్తారని అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Next Story

Most Viewed