గుప్పెడంత మనసు రిషి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్

by Disha Web Desk 10 |
గుప్పెడంత మనసు రిషి మళ్లీ  రీ ఎంట్రీ ఇస్తున్నాడా..  వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ మా లో కార్తీకదీపం సీరియల్ తర్వాత అంత పేరు సంపాదించుకున్న సీరియల్ ఏదైనా ఉంది అంటే అది ఇది మాత్రమే. గుప్పెడంత మనసు సీరియల్లో నటించిన హీరో హీరోయిన్లు రిషి, వసుధార సూపర్ జోడి అనిపించుకున్నారు. కానీ, ఉన్నట్టుండి ఏమైందో తెలీదు హీరో పాత్రను అర్ధం కాకుండా చేసి మొత్తానికి రిషి కనిపించకుండా చేసారు.

అయితే చాలా మంది రిషిధారలు కలుస్తారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక సీరియల్లో ముఖేష్ గౌడ రిషి కనిపించనప్పటికీ, తన అభిమానులను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పలకరిస్తున్నాడు. తాజాగా తన అభిమాని చేసిన పనికి షాక్ అయిన ముఖేష్ గౌడ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి తనకి ఎంతలా అభిమానిస్తున్నారో తెలియజేసాడు.

‘మీరు అందిస్తున్న ఈ ప్రేమను, నా బాధ్యతను నేను ఎప్పటికీ మరచిపోలేను. ఈ అభిమానం ఎప్పటికి ఇలాగే ఉండాలి’ అంటూ తన లేడీ ఫ్యాన్ వీడియోను షేర్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టాడు ముఖేష్ గౌడ. ఇది చూసిన అభిమానులు మళ్లీ సీరియల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story