- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'చెల్లో షో'.. ఇండియా నుంచి ఆస్కార్ బరిలో
by Hajipasha |
దిశ, సినిమా : ఆస్కార్ గెలవడం గురించి పక్కనపెడితే కనీసం ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌కు నామినేట్ కావడమే గొప్ప విషయం.

X
దిశ, సినిమా : ఆస్కార్ గెలవడం గురించి పక్కనపెడితే కనీసం ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌కు నామినేట్ కావడమే గొప్ప విషయం. ఈ నేపథ్యంలోనే గుజరాత్ మూవీ 'చెల్లో షో(లాస్ట్ ఫిల్మ్ షో)' ఇండియా నుంచి ఆస్కార్స్ 2023కు అధికారిక ఎంట్రీగా నమోదై సంచలనం సృష్టించింది. ఒకప్పటి సినిమాలు ఎలా తీశారు? అనే అంశంపై తెరకెక్కిన ఈ మూవీ.. ఒకరకంగా ఆటో బయోగ్రాఫికల్ డ్రామా. ఇండియన్ సినిమా దశాబ్దాలుగా ఎలా మారుతూ వచ్చింది? సెల్యులాయిడ్ నుంచి డిజిటల్‌కు జరిగిన మార్పు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేత నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. సినిమాపై అభిమానంతో రూపొందించిన ఈ మూవీ ఇప్పుడు ఆస్కార్‌కు నామినేట్ కావడం విశేషం. ఇక ఈ సినిమా అక్టోబర్ 14న గుజరాత్ సహా ఇండియా వ్యాప్తంగా పలు థియేటర్లలో రిలీజ్ కానుంది.
Next Story






