‘గూఢచారి-2’ ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.. హైప్ పెంచిన అడివి శేష్

by Mallepaka Hamsa |

గూఢచారి-2 అద్భుతంగా ఉండబోతోంది, ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

‘గూఢచారి-2’ ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.. హైప్ పెంచిన అడివి శేష్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ‘డెకాయిట్’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ఇప్పుడు తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సీక్వెల్ ‘గూఢచారి-2’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘గూఢచారి’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అడివి శేష్ సరసన వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల మరియు అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజా ఇంటర్వ్యూలో అడివి శేష్ తన రాబోయే ప్రాజెక్టుల గురించి కీలక విషయాలను పంచుకున్నారు. "గూఢచారి-2 అద్భుతంగా ఉండబోతోంది, ప్రేక్షకులను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, తన మరో సూపర్ హిట్ సిరీస్ ‘హిట్-4’ గురించి కూడా అప్‌డేట్ ఇచ్చారు. దర్శకుడు శైలెష్ కొలను ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని, త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని వెల్లడించారు. మల్టీస్టారర్ సినిమాలపై స్పందిస్తూ.. మంచి కథలు మరియు పాత్రలు దొరికితే ఇతర హీరోలతో కలిసి నటించేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని అడివి శేష్ తన మనసులోని మాటను బయటపెట్టారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న శేష్, రాబోయే సినిమాలతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తారో చూడాలి.

Next Story