- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగాస్టార్ చిరంజీవిని సన్మానించిన గవర్నర్ తమిళి సై
పద్మ విభూషన్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు చెప్పారు.

దిశ, వెబ్‌డెస్క్: పద్మ విభూషన్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు చెప్పారు. శుక్రవారం స్వయంగా రాజ్‌భవన్‌కు పిలిపించుకొని సన్మానించారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా ఉన్నారు. కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు మరి కొంతమంది తెలుగు వాళ్లకు కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత మాజీ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడికి, కేంద్ర మంత్రిగా దేశానికి సేవలు అందించిన చిరంజీవికి పద్మ విభూషన్ ప్రకటించింది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు వారికి కొందరు స్వయంగా, మరికొందరు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో అట్టహాసంగా అవార్డు గ్రహీతలను సత్కరించింది. తాజాగా.. గవర్నర్ సత్కరించడంపై మెగాస్టార్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.






