ఘనంగా గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన మలయాళ ముద్దుగుమ్మ

by Mallepaka Hamsa |

వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీని నేను ఎప్పుడూ అభిమానిస్తుంటాను. ఆయన దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది.

ఘనంగా గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన మలయాళ ముద్దుగుమ్మ
X

దిశ, సినిమా: మ్యాచో స్టార్ గోపీచంద్ తన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. వరుస యాక్షన్ చిత్రాలతో అలరించే ఆయన, ఇప్పుడు తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచే #Gopichand34వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. టాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లను కంపోజ్ చేసిన ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్, ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు టాలీవుడ్ దిగ్గజాలు హాజరై చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫస్ట్ షాట్‌కు దర్శకత్వం వహించగా, మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టారు. నిర్మాత దామోదర్ చిత్ర స్క్రిప్ట్‌ను అందించగా, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు పక్కాగా సరిపోయే ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాను వెంకట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా గోపీచంద్ తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. "వెంకట్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీని నేను ఎప్పుడూ అభిమానిస్తుంటాను. ఆయన దర్శకత్వంలో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా మిత్రులు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణంలో 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రం పట్ల నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను" అని రాసుకొచ్చారు. అయితే ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఒక యంగ్ బ్యూటీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె మరెవరో కాదు, మలయాళ నటి అనార్కలీ నజర్. గోపీచంద్ సరసన హీరోయిన్‌గా నటించే లక్కీ ఛాన్స్ ఈ అమ్మడు దక్కించుకుంది. ప్రస్తుతం గోపీచంద్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కుమార్ సాయితో ఒక సినిమా, సంకల్ప్ రెడ్డితో ‘భరతవర్ష’ చేస్తూనే, ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కించారు. యాక్షన్ కింగ్ మళ్ళీ తన మార్క్ గర్జనతో థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.అయితే గత కొద్ది కాలంగా హిట్ కోసం తెగ కష్టపడుతున్న గోపీచంద్‌కు ఈ మూవీ అయినా హిట్ ఇస్తుందో చూడాలి.

Next Story