- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిట్ కోసం గోపిచంద్ సాహసం.. కొత్త దర్శకుడితో భారీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్.. పులి వేట మొదలైందంటూ మేకర్స్ పోస్ట్
తన 33వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో వార్తల్లో నిలిచారు. గోపీచంద్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ #Gopichand34 చిత్రాన్ని ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్ తెరకెక్కిస్తుండటం విశేషం.

దిశ, సినిమా: టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సరైన మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆయన, ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ‘భరతవర్ష’ వంటి భారీ ప్రాజెక్టులో నటిస్తున్న గోపీచంద్, తాజాగా తన 34వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో వార్తల్లో నిలిచారు. గోపీచంద్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే ఈ #Gopichand34 చిత్రాన్ని ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్ తెరకెక్కిస్తుండటం విశేషం. యాక్షన్ సినిమాలకు అదిరిపోయే స్టంట్స్ అందించే వెంకట్, ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాను ఆయన సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు.
తాజాగా విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో ఒక పులి కనిపిస్తుండటం సినిమాలోని గాంభీర్యాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా ‘‘ పులి వేట మొదలైంది. గర్జనకు ముందు... ఒక ఆచారం ఉంటుంది’’ అనే క్యాప్షన్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. గోపీచంద్ ఈ సినిమాలో ఒక ఊర మాస్ పాత్రలో కనిపించబోతున్నారని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు మే 3న, అంటే రేపు ఉదయం ఘనంగా జరగనున్నాయి. గోపీచంద్ ప్రస్తుతం కుమార్ సాయితో ఒక సినిమా, సంకల్ప్ రెడ్డితో ‘భరతవర్ష’ చేస్తూనే, ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్టును పట్టాలెక్కిస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. యాక్షన్ కింగ్ మళ్ళీ తన మార్క్ గర్జనతో థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.






