- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గూస్‌బంప్స్ అలర్ట్.. ‘మోగ్లీ’ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన సాక్షి మడోల్కర్
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’(Mowgli).

దిశ, సినిమా: యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల(Roshan Kanakala) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మోగ్లీ’(Mowgli). ఈ సినిమాకు ‘కలర్ ఫొటో’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. పలు బ్రాండ్స్‌కు చెందిన యాడ్స్‌లో కనిపించిన ఈ భామ ఇప్పుడు ‘మోగ్లీ’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. కాళభైరవ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన సాక్షి మడోల్కర్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించింది. నవంబర్ 25న ‘మోగ్లీ’ సెకండ్ సింగిల్ ‘‘వనవాసం’’ అని సాగే సాంగ్ రాబోతున్నట్లు తెలుపుతూ.. ఇద్దరు ప్రేమికులు చేతులను గట్టిగా పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌కు ‘‘గూస్ బంప్స్ అలర్ట్.. అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఉత్సాహభరితమైన సాంగ్ రాబోతుంది. ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






