సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే షూటింగ్‌ సెట్‌లోకి

by Harish |
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే షూటింగ్‌ సెట్‌లోకి
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని నెలలుగా మయోసైటిస్ అనే కండరాల సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో గత కొన్ని నెలలుగా ఆమె సినిమాలకు, షూటింగ్‌లకు దూరంగా ఉంది. అలా సమంత చేయాల్సిన సినిమాలకు బ్రేకులు పడ్డాయి. ఈ క్రమంలో సమంతకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి వచ్చింది. ప్రముఖ మీడియా ప్రచురించిన దాని ప్రకారం.. తమ ప్రతినిధి సమంత సన్నిహితులతో మాట్లాడి ఈ విషయం రాబట్టినట్లు తెలిపారు. 'ఆమె మయోసైటిస్ నుంచి కోలుకుంది. ఫుల్ జోష్‌తో కెమెరా ముందుకు రాబోతుంది. ఆమె ఒప్పుకున్న అన్ని సినిమాలు పూర్తి చేస్తుంది. విజయ్ దేవరకొండతో చేస్తున్న 'ఖుషి' షూటింగ్ 80% శాతం కంప్లీట్ అయ్యింది' అని వెల్లడించారు.

Next Story

Most Viewed