- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పెళ్లికి ఓకే చెప్పిన ఇరు కుటుంబాలు.. ఎంగేజ్‌మెంట్ అయ్యేది అప్పుడే(పోస్ట్)
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ.. ఈ సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మ్యారేజ్ తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ కపుల్ మీద ఎవరి కళ్లు పడ్డాయో ఏమో మనస్పర్థలు రావడం స్టార్ అయ్యాయి.
దీంతో ఇద్దరు విడిపోవాలని ఫిక్స్ అయి విడాకులు తీసుకున్నారు. ఇక డివోర్స్ తర్వాత చైతన్య గత ఏడాది స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala)ను పెళ్లి చేసుకున్నాడు. కానీ సమంత మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. దీంతో సామ్ ఫ్యాన్స్ సమంతను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత కొన్ని రోజులుగా సమంత రెండో పెళ్లి పై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే. తాజాగా ఈ వార్త పై మళ్లీ ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. అందులో సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతుందని, తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని టాక్ నడుస్తోంది. అంతేకాదండోయ్ వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఓకే చేసేశారట. ఇందులో భాగంగా ఇంకో రెండు నెలల్లో వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరగనున్నదట. ఇక దీనిపై ఇటు సమంత లేదా రాజ్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.






