ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ అప్డేట్ ఇచ్చిన తమన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-03 08:18:17  IST  )

మోస్ట్ అవైటెడ్ హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’ (The Raja Saab)పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ది రాజాసాబ్’ అప్డేట్ ఇచ్చిన తమన్
X

దిశ, సినిమా: మోస్ట్ అవైటెడ్ హారర్ ఫాంటసీ మూవీ ‘ది రాజాసాబ్’ (The Raja Saab)పై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రభాస్ (Prabhas)నటిస్తున్న సినిమా కావడంతో మొదటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ బజ్ ఉంది. పైగా దర్శకుడు మారుతి (Maruthi)టచ్, హారర్‌తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనమే సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మ్యూజిక్ పరంగా కూడా ‘ది రాజాసాబ్’ ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసింది. తమన్ అందించిన పాటలు ఒక్కొక్కటిగా చార్ట్‌బస్టర్స్‌గా మారుతున్నాయి. మూడు పాటలతోనే సినిమా మ్యూజికల్ రేంజ్ ఏంటో చూపించారు మేకర్స్.

తాజాగా నాలుగో పాట‘నాచే నాచే’తో మరోసారి మ్యాజిక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటలో ప్రభాస్ ఎనర్జీ, గ్రాండ్ సెట్స్, మాస్ బీట్‌లు కలిసి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని ఇండస్ట్రీలో టాక్. అయితే ఈ పాట జనవరి 5న రాబోతున్నట్లు తమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా..ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ నటించడం సినిమాపై గ్లామర్ టచ్‌ను మరింత పెంచింది. ముగ్గురు హీరోయిన్‌ల పాత్రలకు కథలో కీలకమైన ప్రాధాన్యం ఉండబోతుందట. అలాగే విలన్ పాత్ర సంజయ్ దత్, సపోర్టింగ్ క్యారెక్టర్ యోగిబాబు పాత్ర కూడా కథను మరో లెవెల్‌కు తీసుకెళ్లేలా డిజైన్ చేశారని సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. జనవరి 9న రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘ది రాజాసాబ్’.. సంక్రాంతి సీజన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతుంది.

Next Story