- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో ‘రాజా సాబ్’ నుంచి మరో ట్రైలర్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’(Raja Saab).

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(Maruti) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ హారర్ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’(Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్(TG Vishwa Prasad) రూపొందిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.
ఇక ఇప్పటికే ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ నుంచి విడుదల చేసిన ‘సహనా.. సహనా..’ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తమన్(Taman) అందించిన స్వరాలు, ప్రభాస్ స్టైలిష్ లుక్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి. ఈ పాట విడుదలతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి. ఇదిలా ఉంటే.. రాజాసాబ్ సినిమా ప్రచారాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ఒక ఓపెన్ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా ‘ది రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 27న నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజాసాబ్ నుంచి ఇప్పటికే ఓ ట్రైలర్‌ను విడుదల చేయగా అది సినిమాపై మరింత అంచనాలను పెంచగా.. త్వరలో మరో ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ నెల 27న జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ను విడుదల చేస్తారని సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






