పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Veeramallu టీజర్ అప్డేట్

by Disha Web Desk 2 |
పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. Veeramallu టీజర్ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో పవర్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్‌గా, పాన్ ఇండియాగా వస్తోంది. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌ సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా.. ఈ సినిమా టీజర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తోంది. జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. మరి దీనిపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి మేకర్లు ప్లాన్ చేస్తున్నారు.

Also Read...

'ది చెల్లో షో' ఆస్కార్ నామినేషన్‌ ఎంపికపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

Next Story