Ustaad Bhagat Singh: అభిమానులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి బరిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’..

by Chukka Sudharani |   (  Updated:2023-08-03 10:52:21  IST  )

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి.

Ustaad Bhagat Singh: అభిమానులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి బరిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’..
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగిపోయిందంటూ ఇటీవల చాలా వార్తలు వినిపించాయి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో.. ఎలక్షన్స్ అనంతరం షూటింగ్ స్టార్ట్ చేద్దామని పవన్ నిర్ణయించాడనే టాక్ వినిపించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనుకున్న సమయానికి ముందే విడుదల కానుందట. అవును.. హరీష్ శంకర్‌కు కొన్ని కీలక సూచనలు చేసిన పవన్ కళ్యాణ్ సంక్రాంతికి సినిమాను సిద్ధం చేయమన్నారని.. వరుస షెడ్యూల్స్‌తో షూటింగ్ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారని సమాచారం. దీనికోసం కేవలం 30 రోజులు కాల్షీట్స్ ఇవ్వగా.. ఈ టైమ్‌లోనే తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయనున్నారట పవన్.

Read More..

బేబీ సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ పెట్టుకున్న వాచ్ ఎన్ని కోట్లో తెలుసా?

పవన్ కల్యాణ్‌ నాతో పిల్లల్ని కను.. వారిని రాజకీయాల్లోకి పంపిద్దాం: శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్!

పవన్ కల్యాణ్ చేసిన తప్పుకు వారికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి.. అసలు ఏం జరిగిందంటే?

Next Story