- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ డేట్ ఫిక్స్!
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ మూవీ అన్ని భాషల్లో ఘన విజయం సాధించడంతో పాటు సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఆయన సెల్వమణి సెల్వరాజ్(Selvamani Selvaraj) దర్శకత్వంలో ‘కాంత’ (kantha)మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను 1950 మద్రాసులో జరిగిన ఒక ఉత్కంఠభరిమైన నాటకీయ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. దీనిని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లో ఒకరైన సురేష్ ప్రొడక్షన్స్, వేఫారేర్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రానా దగ్గుబాటి నిర్మిస్తున్నారు.
ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తుండగా.. స్టార్ యాక్టర్ సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






