మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒకే వేదికపై పవర్ స్టార్, మెగాస్టార్?

by Disha Web Desk 6 |
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఒకే వేదికపై పవర్ స్టార్, మెగాస్టార్?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడటంతో వరుస అప్డేట్స్‌ను ప్రేక్షకులకు తెలుపుతున్నారు చిత్రబృందం. ఈ క్రమంలోనే మెగా అభిమానులకు విజయ దశమి కంటే ముందే మరొక పండుగ ఇచ్చేందుకు మెగాస్టార్, మేకర్స్ ప్లాన్ చేశారు.

'గాడ్ ఫాదర్' ప్రీరిలీజ్ ఈవెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను తీసుకురాకాలని మేకర్స్ అనుకుంటున్నారట. దీనికి ఆయన కూడా ఒకే చెప్పినట్లు ఓ వార్త చక్కర్లు కొదుతోంది. కాగా, ఈ ఫిల్మ్‌లో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. ఇందులో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా ఒక పాత్ర పోషించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

గాడ్ ఫాదర్ నుంచి నయనతార ఫస్ట్ లుక్‌..

Next Story

Most Viewed