మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ రోజున SSMB29 గ్లింప్స్..!

by I. Sairam |

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh BAbu), ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ స్పెషల్ రోజున SSMB29 గ్లింప్స్..!
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh BAbu), ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్‌బి-29’(SSMB-29) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే అడ్వెంచర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మహేష్ బర్త్‌ డే సందర్భంగా ఆగస్టు 9న SSMB29 నుంచి ఓ గ్లింప్స్ రిలీజ్ కానుందని న్యూస్ వైరల్ అవుతోంది. రాజమౌళి కీలక సీన్స్‌ను మరింత మాడిఫై చేయడంలో బిజీగా ఉన్నారట.

అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కుతుండటంతో, ప్రతి దృశ్యాన్ని పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దేందుకు జక్కన్న సమయం తీసుకుంటున్నారని టాక్. కాగా మహేష్ గత సినిమాల్లాగా రాజమౌళి-మహేష్ సినిమా కేవలం టాలీవుడ్, బాలీవుడ్‌తోనే ఆగిపోకుండా, హాలీవుడ్ స్థాయిలో రూపొందుతోందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అందుకే ఈ సినిమా బడ్జెట్ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఉంటుందని, హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story