ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘పుష్ప 2’లో అల్లు అయాన్!

by sudharani |
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘పుష్ప 2’లో అల్లు అయాన్!
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప 2’. ఈ మూవీ మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు సీక్వెల్ కోసం మరింత కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొదటి పార్టుతో పోల్చుకుంటే.. పార్ట్ 2 మరింత భారీగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారట మేరక్స్. ముక్యంగా యాక్షన్ సీక్వెల్స్ అదిరిపోయేలా ఉండనున్నాయని తెలుస్తోంది.

దీందో రోజు రోజుకు ‘పుష్ప 2’ పై అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన రోజుకో కొత్త న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. ఇక తాజాగా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ ఓ కీ రోల్‌లో కనిపించనున్నాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ.. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ అవుతోంది. దీంతో ఐకాన్ ఫ్యాన్స్ పండుగా చేసుకుంటున్నారు. కాగా ఈ చిత్రం ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

Advertisement

Next Story