- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి రాబోతున్న ‘అఖండ-2’!
నందమూరి బాలకృష్ణ (Balakrishna)ఇప్పటికీ వరుస సినిమాలతో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు.

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ (Balakrishna)ఇప్పటికీ వరుస సినిమాలతో కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘అఖండ-2’ (Akhanda-2)చరిత్ర తిరగరాస్తోంది. విడుదలకు ముందు పలు వివాదాలు తలెత్తినప్పటికీ ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై.. బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌లో దూసుకుపోతుంది. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. తొలిరోజు నుంచే థియేటర్స్‌లో భారీ ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఓవర్సీస్‌లోనూ ఇతర భారతీయ మార్కెట్లలోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే ఈ భారీ చిత్రంలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటించగా.. హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించారు.
తమన్ మ్యూజిక్ అందించగా.. ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న ‘అఖండ-2’ నెలరోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ సంస్థ సొంతం చేసుకోగా.. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






