Sunny Leone : అక్కడికెళ్తే సన్నీలియోన్ తో మీ కోరిక తీరుతుంది..

by Dishafeatures1 |
Sunny Leone : అక్కడికెళ్తే సన్నీలియోన్ తో మీ కోరిక తీరుతుంది..
X

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోన్.. గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో వచ్చిన ప్రతి ఒక క్యారెక్టర్ చేస్తూ అలరిస్తోంది. ఇటు సినిమాల్లో నటిస్తూనే..మరోవైపు వ్యాపారంలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పుడు రెస్టారెంట్‌ ఓనర్‌గా మారారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా- సెక్టార్ 129లో సన్నీ లియోన్ రెస్టారెంట్‌ను ప్రారంభించాగా ఈ రెస్టారెంట్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

ఇందులో అనేక రకాల వంటకాలు లభిస్తాయి. కాగా ఈ రెస్టారెంట్ కి సన్నీ ‘చికలోకా నోయిడా’ అని పేరు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అంతే కాదు రెస్టారెంట్ పేరుతో పర్సనల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి అందులో.. రెస్టారెంట్ ప్రారంభోత్సవ వీడియోను షేర్ చేసింది. ఇక రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు వెళ్లారు. కాగా తన రెస్టారెంట్ లో సన్నీ స్వయంగా తన చేతులతో పిజ్జా తయారు చేస్తూ చాలా హ్యాపీగా కనిపించింది. ఈ రెస్టారెంట్‌తో ప్రపంచాన్ని గెలవడమే తన లక్ష్యమని చెప్పింది సన్నీ. ఇక ఈ హాట్ బ్యూటీ చేతి వంట తిన్నాలనే కోరిక ఉన్నవారు ఈ రెస్టారెంట్ కి వెళ్ళండి.



Next Story

Most Viewed