సమ్మర్ స్పెషల్‌గా థియేటర్స్‌లోకి ‘గోదారి గట్టుపైన’ మూవీ.. రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-12 15:30:16  IST  )

తాజాగా, చిత్రబృందం ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు. "గోదావరి నడిబొడ్డు నుండి వెండితెర దాకా సాగే ఈ మనసుని తాకే కథను ఈ వేసవిలో మీ ముందుకు తెస్తున్నాం.

సమ్మర్ స్పెషల్‌గా థియేటర్స్‌లోకి ‘గోదారి గట్టుపైన’ మూవీ..  రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
X

దిశ, సినిమా: తనదైన మేకింగ్ స్టైల్,నేచురల్ యాక్టింగ్‌తో యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న కుర్ర హీరో సుమంత్ ప్రభాస్. ‘మేము ఫేమస్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ టాలెంటెడ్ యాక్టర్, మొదటి మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే, ఆ సక్సెస్ తర్వాత మళ్ళీ వెండితెరపై కనిపించడానికి సుమంత్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. పక్కా ప్లానింగ్‌తో, ఒక మంచి ఫీల్ గుడ్ స్టోరీని ప్రేక్షకులకు అందించాలనే పట్టుదలతో ‘గోదారి గట్టుపైన మూవీతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. నిధి ప్రదీప్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను సుభాష్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. తాజాగా, చిత్రబృందం ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు. "గోదావరి నడిబొడ్డు నుండి వెండితెర దాకా సాగే ఈ మనసుని తాకే కథను ఈ వేసవిలో మీ ముందుకు తెస్తున్నాం.

మే 8న 'గోదారి గట్టుపైన' మూవీ సమ్మర్ స్పెషల్‌గా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది" అని ప్రకటించారు. సుమంత్ ప్రభాస్ మార్క్ ఎనర్జీకి గోదావరి అందాలు తోడవ్వడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఏషియన్ సినిమాస్ సమర్పణలో, రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. వేల్పూరు, రేలంగి, భీమవరం వంటి పచ్చని పల్లెటూళ్ల నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథకు నాగవంశీ కృష్ణ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, వేసవి సెలవుల్లో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని అందిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. సుమంత్ ప్రభాస్ తన మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి ఫేమస్ అయ్యాడు. మరి ఈ రెండేళ్ల విరామం తర్వాత వస్తున్న ‘గోదారి గట్టుపైన’ తో ఆయన బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Next Story