- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేసవి బరిలో ‘గోట్’.. సుధీర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీగా రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్!
ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో ఉంటుంది.

దిశ, సినిమా: సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గోట్’ . దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకత్వం వహిస్తుండగా.. మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి కంటెంట్‌కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. నిర్మాత మాట్లాడుతూ.. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో ఉంటుంది. సుడిగాలి సుధీర్ కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. నేటి యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం కూడా దాగి ఉంటుంది. తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.






