థియేటర్స్‌కి వెళ్లి ‘కింగ్‌డమ్’ చూడండి.. బయటకు వచ్చాక మాకు ఫోన్ చేసి తిట్టండి: నాగవంశీ

by Mallepaka Hamsa |

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom).

థియేటర్స్‌కి వెళ్లి ‘కింగ్‌డమ్’ చూడండి.. బయటకు వచ్చాక మాకు ఫోన్ చేసి తిట్టండి: నాగవంశీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ చిత్రంలో డిజాస్టర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో కనిపించగా.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించాకె. ఇక ఇందులోంచి విడుదలైన ప్రతి అప్డేట్ పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ‘కింగ్‌డమ్’ భారీ అంచనాల మధ్య నేడు (జులై 31) థియేటర్స్‌లోకి వచ్చింది. మొదటి షో నుంచి ఈ సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘కింగ్‌డమ్’ భాగ్యశ్రీ బోర్సేకు, విజయ్‌కి బ్లాక్ బస్టర్ హిట్ తెచ్చిపెట్టేలా ఉంది.

ఈక్రమంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది ఇలాంటివి ఏమి పట్టించుకోకండి, ప్రతి సినిమాకి కామన్ ఇవి. ‘కింగ్‌డమ్’ అయితే చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది మంచి హై ఇస్తుంది. అందుకే థియేటర్స్‌కు వెళ్లి మా మూవీని చూడండి మీకు నచ్చక పోతే కాల్ చేసి తిట్టండి.. అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను నన్ను నమ్మండి. ఆంధ్రాలో మా సక్సెస్ మీట్ చేస్తాం. మా పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండనే. ఇక హృదయం లోపల సాంగ్ పెట్టడానికి స్కోప్ లేదు. చాలామంది ఈ కంప్లైంట్ చెబుతున్నారు. వాళ్లు విజయ్ దేవరకొండ కిస్ మిస్ అయ్యామని ఫీలవుతున్నట్లు ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

link

Next Story