- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదిరిపోయే లుక్‌తో షాకిచ్చిన గ్లోబల్ బ్యూటీ.. రెడ్ హార్ట్ సింబల్‌తో ఆగలేకపోతున్నానంటూ హృతిక్ పోస్ట్
ఫ్రాంక్ ఫ్లవర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది బ్లఫ్’ ఒక వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ప్రియాంక ఒక మాజీ సముద్రపు దొంగ పాత్రలో నటించింది.

దిశ, సినిమా: ఒకప్పుడు వెండితెరపై మ్యాజిక్ చేసిన క్రేజీ కాంబినేషన్ హృతిక్ రోషన్(Hrithik Roshan)-ప్రియాంక చోప్రా(Priyanka Chopra). క్రిష్, అగ్నీపథ్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జోడీ, చాలా కాలం తర్వాత మళ్ళీ వార్తల్లో నిలిచింది. ప్రియాంక చోప్రా నటించిన లేటెస్ట్ హాలీవుడ్ మూవీ ‘ది బ్లఫ్’ (The Bluff) విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఆమెపై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ప్రియాంక సోషల్ మీడియాలో కొన్ని అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. బ్రౌన్ అవుట్‌ఫిట్, గ్రీన్ స్కర్ట్, సముద్రపు దొంగలను తలపించే విలక్షణమైన హెడ్‌గేర్‌తో ప్రియాంక చాలా స్టైలిష్‌గా కనిపించి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ ఫోటోలను చూసిన హృతిక్ రోషన్.. ‘‘బ్యూటిఫుల్.. ఈ సినిమా చూడటానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’’ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీతో రిప్లై ఇచ్చారు.
‘ది బ్లఫ్’ చూసేందుకు ఆగలేకపోతున్నాను అనడంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఫ్రాంక్ ఫ్లవర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది బ్లఫ్’ ఒక వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ప్రియాంక ఒక మాజీ సముద్రపు దొంగ పాత్రలో కనిపించనున్నారు. తన హింసాత్మక గతాన్ని వదిలేసి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక మహిళ చేసే సాహసోపేతమైన పోరాటమే ఈ సినిమా కథ. ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ప్రియాంక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 25న నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ ‘ది బ్లఫ్’ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.






