- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్లోబల్ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్..
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమైంది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమైంది. అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ నుంచి భారీ ప్రాజెక్టులతో ఆమె వార్తల్లో నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’(Varanasi)తో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియాంక చోప్రాకు సంబంధించిన మరో హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ సూపర్ హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్-4’(Krish-4)లో ఆమె లీడ్ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మళ్లీ ప్రియాంకనే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం. హృతిక్–ప్రియాంక జోడీగా గతంలో వచ్చిన ‘క్రిష్’ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న నేపథ్యంలో, అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేయాలనే ఆలోచనతో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో చాలా ఏళ్ల విరామం తర్వాత ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వనుంది.






