Brahmanandam :‘బ్రహ్మా ఆనందం’ సినిమా గ్లింప్స్ రిలీజ్..

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-28 15:36:47  IST  )

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్యపాత్రలో రూపొందుతున్న చిత్రం 'బ్రహ్మ ఆనందం'.

Brahmanandam :‘బ్రహ్మా ఆనందం’ సినిమా గ్లింప్స్ రిలీజ్..
X

దిశ, సినిమా: ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ముఖ్యపాత్రలో రూపొందుతున్న చిత్రం 'బ్రహ్మ ఆనందం'. ఈ చిత్రంలో బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్‌ ఆయనకు మనవడిగా నటిస్తున్నాడు. తాత, మనవళ్ల హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకుడు. రాహుల్‌ యాదవ్‌ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ పాత్రలు అందర్ని ఆకట్టుకుంటాయి. డిసెంబరు 6న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం' అన్నారు ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్‌ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం శాండిల్య పీసపాటి అందిస్తున్నారు.

janaka aithe ganaka: జీవితాంతం గుర్తుండే సినిమా!

Next Story