‘‘ఈ సారి ఒక్కొక్కడికి బుర్ర పాడు.. బుడ్డలు జారుడే’’.. హైప్ పెంచుతున్న ‘కే-ర్యాంప్’ గ్లింప్స్

by Mallepaka Hamsa |

హీరో కిర‌ణ్ అబ్బవ‌రం(Kiran Abbavaram) ఇటీవల ‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఒక్కసారిగా ఆయన రేంజ్ మారిపోయింది.

‘‘ఈ సారి ఒక్కొక్కడికి బుర్ర పాడు.. బుడ్డలు జారుడే’’.. హైప్ పెంచుతున్న ‘కే-ర్యాంప్’ గ్లింప్స్
X

దిశ, సినిమా: హీరో కిర‌ణ్ అబ్బవ‌రం(Kiran Abbavaram) ఇటీవల ‘క’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఒక్కసారిగా ఆయన రేంజ్ మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ జైన్స్ నాని కాంబినేషనల్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘కే-ర్యాంప్‌’(K-Ramp). హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్‌‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ బ్యూటీ యుక్తి తరేజా(Yukti Tareja) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా, చిత్రబృందం ఈ సినిమా నుంచి డబుల్ అప్డేట్స్ విడుదల చేశారు.

నేడు కిరణ్ అబ్బవరం పుట్టినరోజు కావడంతో అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఈ మూవీ అక్టోబర్ 18న థియేటర్స్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ‘కే-ర్యాంప్’ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో ‘‘అందరికీ నమస్కారం.. ఈసారి ఒక్కొక్కడికి బుర్ర పాడు, బుడ్డలు జారుడే అని డైలాగ్ చెప్తూ బార్‌లో చిల్లర గాయ్‌లా కిరణ్ అబ్బవరం కనిపిస్తాడు. amb సినిమాల్లో మనం మలయాళ ప్రేమ కథలు చూసి హిట్ చేస్తాం. కానీ తెలుగు ప్రేమ కథలతోనే మనకు ప్రాబ్లం.. ఎందుకంటే.. వాళ్లదాంట్లో ఉన్న ఆర్ట్, ఎండ్‌సిటీ మనదాంట్లో ఉండదు. మన ప్రేమ గెలవకున్నా పర్లేదు.. ప్రేమ మాత్రం బాగుండాలి’’ అని చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ఇందులో కిరణ్ అబ్బవరం ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించగా.. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా గ్లింప్స్ ఉన్నాయి.

link

Next Story