అసురుడు వచ్చేశాడు.. యుద్ధం తెచ్చేసాడు.. అంచనాలను పెంచుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 08:32:35  IST  )

నేడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పుట్టినరోజు కావడంతో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.

అసురుడు వచ్చేశాడు.. యుద్ధం తెచ్చేసాడు.. అంచనాలను పెంచుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్
X

దిశ, సినిమా: నేడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) పుట్టినరోజు కావడంతో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’(SambaralaYetiGattu ) చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. ఇక ఇందులో ‘‘అసుర సంధ్యవేళ మొదలైంది రాక్షసుల ఆగమనం.. అసురుడు వచ్చేశాడు.. యుద్ధం తెచ్చేస్తాడు’’ అని సాయి ధరమ్ తేజ్ చెప్పిన డైలాగ్స్ అంచనాలను పెంచుతున్నాయి. అలాగే విజువల్స్, అజనీష్ బిజీయం నరాలు గగుర్పుడిచేలా ఉన్నాయి. ఇందులో ఆయన ఓ ఊరు జనాల కోసం పోరాడుతాడు.

ప్రస్తుతం ఈ గ్లింప్స్ చూసిన వారిలో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అనే ఆసక్తి పెరిగిపోయింది. కాగా.. ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)హీరోయిన్‌గా నటిస్తోంది. రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను.

ఈ సినిమా నీ కెరీర్‌కి చాలా ముఖ్యం. మా గురువు గారితో ఓ మూవీ చేశాక.. ఓ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. కానీ రెండు చిత్రాలు ఆపేశారు. ఈ సినిమాతో అవకాశం వచ్చింది. అందుకే దీని కోసం నా సర్వస్వం ధారపోశాను. మీ అందరికీ ‘సంబరాల ఏటిగట్టు’ నచ్చుతుందని అనుకుంటున్నాను. రిలీజ్ లేట్ అవుతుందని అనుకున్నా.. కానీ మంచి క్వాలిటీతో తీసుకురావాలని కష్టపడ్డాం. ఇప్పుడున్న జనరేషన్‌కి మీ ఆలోచనలకు అనుకూలంగా రాబోతుంది’’ అని అన్నారు.


READ MORE ....

ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ తేదీ ఖరారు




Next Story