'రావణాసుర' మూవీ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్!

by Disha Web Desk 12 |
రావణాసుర మూవీ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్!
X

దిశ, సినిమా: రవితేజ హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం 'రావణాసుర'. రవితేజ సరసన మొత్తం 5గురు హీరోయిన్లు.. అనూ ఇమ్మాన్యూయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దీక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటిస్తున్నారు. హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ చిత్రం షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. జనవరి 26 రవితేజ పుట్టినసందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.


Next Story