నాకు బ్లాక్ బస్టర్ అందించడం నిజంగా నన్ను గర్వపడేలా చేసింది.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఒకప్పుడు నా వేలు పట్టుకుని నడిచిన చిన్న పాపవి.. నేడు ఒక బాధ్యతాయుతమైన, బలమైన మహిళగా ఎదిగావు. నిన్ను చూస్తుంటే తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది.

నాకు బ్లాక్ బస్టర్ అందించడం నిజంగా నన్ను గర్వపడేలా చేసింది.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె, టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల పుట్టినరోజు నేడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ సెలబ్రిటీలు, మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, అందరిలోకి తండ్రి మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తెకు చెప్పిన విషెస్ నెటిజన్ల హృదయాలను హత్తుకుంటున్నాయి. సుస్మిత చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ చిరంజీవి ఎంతో ఎమోషనల్ అయ్యారు. "నా ప్రియమైన సుస్మితకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకప్పుడు నా వేలు పట్టుకుని నడిచిన చిన్న పాపవి.. నేడు ఒక బాధ్యతాయుతమైన, బలమైన మహిళగా ఎదిగావు. నిన్ను చూస్తుంటే తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది" అని రాసుకొచ్చారు. కేవలం తండ్రిగానే కాకుండా, ఒక నటుడిగా కూడా సుస్మిత తన కోసం చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

సుస్మిత ప్రయాణం చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా మొదలైంది. తండ్రిని స్క్రీన్ మీద స్టైలిష్‌గా చూపించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి తండ్రికి ఒక చిరస్మరణీయమైన బ్లాక్‌బస్టర్‌ను అందించిన విషయం తెలిసిందే. ఇక దీనిపై చిరంజీవి స్పందిస్తూ.. "నువ్వు నా సినిమాలు చూడటం నుండి, నా సినిమాను నిర్మించే స్థాయికి ఎదగడం, నాకు ఒక బ్లాక్‌బస్టర్ హిట్ ఇవ్వడం నా జీవితంలో అత్యంత ప్రత్యేకమైన క్షణం. అది నిజంగా నన్ను గర్వపడేలా చేసింది. నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని, నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నా హనీ పాపా" అంటూ ఆశీర్వదించారు. చిరంజీవి తన కూతురితో కలిసి ఉన్న పాత ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story