ప్రేమను అమ్మాయిలు ఈజీగా తీసుకుంటారు..! డైరెక్టర్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 7 |
ప్రేమను అమ్మాయిలు ఈజీగా తీసుకుంటారు..! డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: తమిళ నటుడు మణికందన్, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తున్న సినిమా ‘ట్రూ లవర్’. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందిచారు. ఇక తెలుగులో ఈ సినిమాకు మాస్ మూవీ మేకర్స్, మారుతి టీమ్ ప్రొడక్షన్‌పై స్టార్ డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్ కేఎస్ ప్రజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 10న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ‘బస్ స్టాప్, ప్రేమ కథ చిత్రం అలా నా జర్ని స్లోగా స్టార్ట్ అయ్యి ఈ రోజు ప్రభాస్ దగ్గర ఆగటం అనేది ఒక గొప్ప అచీవ్మెంట్. అలాగే ‘బేబీ’, ఇప్పుడు ‘ట్రూ లవర్’ లాంటి కథలు వచ్చినప్పుడు మిస్ అవ్వకూడదు అనిపిస్తుంది. ఈ సినిమా నిజంగా ఎందుకు చూడమని చెప్తానంటే.. ఒక మగాడు బాధ ఎలా ఉంటది అనేది కరెక్ట్‌గా చూపించారు. ఎందుకంటే ప్రేమలో బాధను అమ్మాయిలు చాలా ఈజీగా తీసుకుంటారు కానీ, ఒక అబ్బాయి బాధ మాత్రం చాలా హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. అలా అని అమ్మాయిలను తప్పు పట్టడం లేదు. వాళ్లు ఫీల్ అవుతారు ఒక అబ్బాయి ఫ్రెండ్‌గా ఉండకూడదా.. వారితో మాట్లాడకూడదా అని. కానీ, తన ప్రేయసిని ఫ్రెండ్ పేరుతో ఎవరైనా ట్రాప్ చేసేస్తారేమోనని అబ్బాయిలకు ఉండే బాధే ఈ సినిమా’ అంటూ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ మారుతి వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed