- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంజాయ్ చేయండి కానీ పెళ్లి చేసుకోవద్దు.. హాట్ బ్యూటీ షాకింగ్ స్టేట్‌మెంట్!
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా(Malaika Arora) చాలా కాలం తర్వాత తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది.

దిశ, సినిమా: బాలీవుడ్ గ్లామర్ క్వీన్ మలైకా అరోరా(Malaika Arora) చాలా కాలం తర్వాత తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, పెళ్లి గురించి, సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా అమ్మాయిలకు ఇచ్చిన సలహాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. “పెళ్లి అనేది జీవితంలో తప్పనిసరిగా చేయాల్సిన పని అనే ఆలోచన నుంచి ముందుగా బయటపడాలి” అంటూ మలైకా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన అనుభవాలను ప్రస్తావిస్తూ, తన పెళ్లి అనుకున్నట్టుగా సాగలేదని మలైకా స్పష్టంగా చెప్పింది.
“నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నా జీవితంలో బాధను మిగిల్చాయి. అందుకే నా లాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అమ్మాయిలు సమాజం లేదా కుటుంబ ఒత్తిడితో పెళ్లి చేసుకోవద్దు” అంటూ ఆమె హెచ్చరించింది. ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన లేకుండా బంధాలు నిలవవని కూడా పేర్కొంది. పెళ్లికి ముందు ప్రతి అమ్మాయి తనను తాను బాగా తెలుసుకోవాలని, తన లక్ష్యాలు ఏంటో స్పష్టత తెచ్చుకోవాలని మలైకా సూచించింది. ఆర్థికంగా, మానసికంగా స్వేచ్ఛ లభించాక పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని చెప్పింది. ప్రేమించండి కానీ వివాహం చేసుకోవద్దని అంటోంది. పెళ్లి అనే సాంప్రదాయాన్ని తాను కూడా బలంగా నమ్మినప్పటికీ తన జీవితంలో అది వర్కౌట్ కాలేదని.. తన భర్తతో విడాకులు తీసుకున్నాక అక్కడే ఆగపోకుండా ముందుకు సాగుతున్నాను అని పేర్కొంది.
అంతేకాకుండా ఆ తర్వాత కొంతమందిలో ప్రేమ పడ్డాను కానీ విసుగుచెందలేదని .. దానిని ఆస్వాదించానని చెప్తోంది. ప్రేమ అనే ఆలోచన తనకెంతో ఇష్టం అంటూ.. తాను ఎవరి ప్రేమ కోసం ఎదురుచూడటం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ అది తన ఇంటి తలపు తడితే మాత్రం కాదనలేనని.. తప్పకుండా ప్రేమను అంగీకరిస్తానని చెప్పుకొచ్చింది. మలైకా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ఆమె మాటలను ‘రియాలిటీ చెక్’గా అభివర్ణిస్తుండగా, మరికొందరు మాత్రం పెళ్లిపై నెగటివ్‌గా మాట్లాడటం సరికాదంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు అయితే అన్ని విధాల ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకోవద్దని చెప్తుందంటూ ట్రోల్ చేస్తున్నారు.






