Ghattamaneni Jayakrishna:ఘట్టమనేని మరో వారసుడు ఎంట్రీ ఫిక్స్!

by Mallepaka Hamsa |   (  Updated:2024-08-19 14:26:47  IST  )

స్వర్గీయ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు అరంగ్రేటం చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Ghattamaneni Jayakrishna:ఘట్టమనేని మరో వారసుడు ఎంట్రీ ఫిక్స్!
X

దిశ, సినిమా: స్వర్గీయ నటుడు సూపర్‌స్టార్‌ కృష్ణ కుటుంబం నుంచి మరో వారసుడు అరంగ్రేటం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటి వరకు ఘట్టమనేని కృష్ణ వారసుడిగా పరిచయమైన మహేష్‌బాబు టాప్‌స్టార్‌గా ఎదిగాడు. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు కూడా హీరోగా కొన్ని చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మించాడు. రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. ఇక విజయ నిర్మల వారసుడిగా రంగ ప్రవేశం చేసిన నరేష్‌ వెర్సటైల్‌ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మహేష్‌బాబు బావ సుధీర్‌బాబు కూడా తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నాడు. తాజాగా ఈ లిస్ట్‌లో చేరబోతున్న మరో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ ఘట్టమనేని. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు వారసుడైన జయకృష్ణ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇందుకు సంబంధించిన శిక్షణలో ఆయన ఉన్నాడు. ఇటీవల ఆయన చేసిన ఓ ఫోటోషూట్‌ వైరల్‌గా మారింది.

Read More..

కొత్త సినిమా స్టార్ట్ చేసిన ఆకాష్ జగన్నాథ్.. అదిరిపోయే టైటిల్ ఫిక్స్

Next Story