మాయాజాలాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి.. ‘సన్నీ సంస్కారీకి తులసి కుమారి’ ట్రైలర్ అప్డేట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సన్నీ సంస్కారీకి తులసి కుమారి’(Sunny Sanskari Ki Tulsi Kumari).

మాయాజాలాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి.. ‘సన్నీ సంస్కారీకి తులసి కుమారి’ ట్రైలర్ అప్డేట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సన్నీ సంస్కారీకి తులసి కుమారి’(Sunny Sanskari Ki Tulsi Kumari). ఇందులో యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. రొమాంటిక్ కామేడీ చిత్రంగా రాబోతుండగా.. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్, మెంటర్ డిసిపుల్ ఫిల్మ్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుసుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 2న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తోంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సన్నీ సంస్కారీకి తులసి కుమారి’ ట్రైలర్ సెప్టెంబర్ 15న రాబోతున్నట్లు టాక్. ఇక ఈ పోస్ట్‌కు ‘‘నీరీక్షణ ముగిసింది. ప్రేమ, రంగుల అతిపెద్ద వేడుక సిద్ధంగా ఉంది. మాయాజాలాన్ని చూడటానికి సిద్ధంగా ఉండండి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story