మెలొడీని అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి.. ‘మాస్ జాతర’ అప్డేట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-05 15:15:09  IST  )

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల (Sree Leela)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(MassJathara ).

మెలొడీని అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి.. ‘మాస్ జాతర’ అప్డేట్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల (Sree Leela)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(MassJathara ). ఈ సినిమా భారీ అంచనాల మధ్య అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను పెంచుతున్నారు. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన మెలోడీ రాబోతున్నట్లు మేకర్స్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. ‘‘హుడియో.. హుడియో’’ సాంగ్ అక్టోబర్ 6న ఉదయం 11:08గంటలకు ప్రోమో రాబోతున్నట్లు వెల్లడించారు.

అంతేకాకుండా కూరగాయల మార్కెట్‌లో రవితేజ, శ్రీలీల మాస్ స్టెప్ వేస్తున్న ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ‘‘మీరంతా మాస్ బీట్స్‌కి అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు ఈ మెలొడీ రాబోతుంది. దానిని అనూభూతి చెందడానికి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఈ చిత్రం భాను భోగ వరపు దర్శకత్వంలో రాబోతుంది. రవితేజ కెరీర్‌లో 75వ చిత్రంగా రాబోతుండటం విశేషం, ‘మాస్ జాతర’ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది.

link

Next Story