- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తన కోపాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి.. ‘బైసన్’ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: స్టార్ హీరోల వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు హీరోగా మారుతున్నాడు. ధృవ్ (Dhruv Vikram)హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బైసన్’(Bison). మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోంది. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీని పా రంజిత్‌కు చెందిన నీలం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నివాస్. కె. ప్రసన్న సంగీతం అందించబోతున్నాడు.
ఈ సినిమా దీపావళి కానుకగా.. రాబోతున్నట్లు సమాచారం. షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. తాజాగా. ‘బైసన్’ చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్ రాబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ సినిమా రెండో పాట సెప్టెంబర్ 16 రాబోతున్నట్లు తెలుపుతూ దృవ్ వర్షంలో తడుస్తున్న పోస్టర్‌ను షేర్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు. ఈ పోస్ట్‌కు.. ‘‘కాలమాదన్ ఎంచుకున్న మార్గంపై తన కోపాన్ని చూపిస్తున్నాడు. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. సెకండ్ సింగిల్ రాబోతుంది ఎంజాయ్ చేయడానికి సిద్ధంకండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.






