‘ది రాజాసాబ్’ ట్రైలర్‌ అప్డేట్.. ఎన్నో గంభీరమైన అనుభవాల కోసం సిద్ధంగా ఉండాలంటూ హైప్ పెంచుతున్న పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-28 12:25:46  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)గత ఏడాది ‘కల్కి’ సినిమాతో భారీ హిట్ సాధించారు.

‘ది రాజాసాబ్’ ట్రైలర్‌ అప్డేట్.. ఎన్నో గంభీరమైన అనుభవాల కోసం సిద్ధంగా ఉండాలంటూ హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)గత ఏడాది ‘కల్కి’ సినిమాతో భారీ హిట్ సాధించారు. ప్రస్తుతం డార్లింగ్ ‘ది రాజాసాబ్’ (The Rajasaab)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో.. ‘ది రాజాసాబ్’ మూవీ మేకర్స్ అభిమానుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ ట్రైలర్ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ సెప్టెంబర్ 29న సాయంత్రం 6గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ.. సంజయ్ దత్, ప్రభాస్ పోస్టర్‌ను షేర్ చేశారు.

అలాగే లక్షలాది మంది నిరీక్షణ చివరకు ముగిసింది. వినోదం, భయ.. ఎన్నో గంభీరమైన అనుభవాల కోసం సిద్ధంగా ఉండండి. ఈ ప్రపంచంలోక రాయల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా.. మారుతి(maruthi) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ రొమాంటిక్ కామెడీ హరర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్ యోగిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

link

Next Story