- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నక్షత్రాలతో నిండిన సాయంత్రం కోసం సిద్ధంగా ఉండండి.. ‘మదరాసి’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) అమరన్, అయలాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) అమరన్, అయలాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ‘మదరాసి’ ఒకటి. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శివ కార్తికేయన్ సరసన రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుండగా.. విక్రాంత్, విద్యుత్, బిజు మీనన్, షబీర్ కల్లరక్కల్, విక్రాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుండటంతో ప్రేక్షకులు సూపర్ ఎక్జైటెడ్‌గా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఎంతగానో ఆకట్టుకోగా.. మూవీమేకర్స్ అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ‘మదరాసి’ చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. గెట్ రెడీ.. నక్షత్రాలతో కూడిన సాయంత్రాన్ని ఆగస్టు 24న ‘మదరాసి’ ట్రైలర్, ఆడియో లాంచ్ జరగబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న శివ కార్తికేయన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.






