సినీ నటిపై గ్యాంగ్ రేప్.. నోటికి గుడ్డ కట్టి మరీ దారుణం!

by Samataha |
సినీ నటిపై గ్యాంగ్ రేప్.. నోటికి గుడ్డ కట్టి మరీ దారుణం!
X

దిశ, సినిమా : రోజు రోజుకు అత్యాచారాలు అనేవి పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వారిపై దాడులు మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా తమిళనాడులో జరిగిన అందరిని షాక్‌కు గురి చేస్తోంది. ఓ సహాయ నటిపై నలుగురు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలు విషయంలోకి వెళితే.. హైదరబాద్‌కు చెందిన ఓ నటి (30) తన కెరీర్ గురించి ఆలోచించి, నటిగా మంచి పేరు సంపాదించుకోవాలనే ఆశతో తమిళనాడుకు వెళ్లింది. అక్కడే తన బంధువుల ఇంట్లో ఉంటూ పలు సినిమాల్లో కూడా నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. అయితే ఆమె బంధువులు ఎవరు లేని సమయం చూసి, నటుడి డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు నటిపై ఆత్యాచారానికి పాల్పడ్డారు. తన కాళ్లు చేతులు కట్టేసి, నోటికి గుడ్డ కట్టి దారుణంగా లైంగికంగా వేధించారు. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితుల గురించి వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed