Mahaveerudu: శివ కార్తికేయన్ ‘గాన గాన’.. పాట వింటే కాలు కదపాల్సిందే..

by Disha Web Desk 10 |
Mahaveerudu: శివ కార్తికేయన్ ‘గాన గాన’.. పాట వింటే కాలు కదపాల్సిందే..
X

దిశ, సినిమా : వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న హీరో శివ కార్తికేయన్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహావీరుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, యాక్షన్ గ్లింప్స్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘గాన గాన’ పాటని విడుదల చేస్తూ మ్యూజికల్ ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్రారంభించారు మేకర్స్. భరత్ శంకర్ కంపోజ్ చేసిన పాటను యాజిన్ నిజార్ ఎనర్జిటిక్‌గా ఆలపించగా.. గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. ఇక అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమాకు విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్, కుమార్ గంగప్పన్, అరుణ్ ఆర్ట్ డైరెక్టర్స్‌గా వర్క్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Dasara: చమ్కీల అంగేసి చిందేస్తున్న నాని



Next Story

Most Viewed