‘గామి’ ప్రమోషన్స్.. దేవుళ్లను దర్శించుకుంటున్న విశ్వక్ సేన్ (ట్వీట్)

by Disha Web Desk 7 |
‘గామి’ ప్రమోషన్స్.. దేవుళ్లను దర్శించుకుంటున్న విశ్వక్ సేన్ (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా సినిమా ‘గామి’. విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని కార్తీక్ శబరీశ్, శ్వేత నిర్మించారు. ఇప్పటికే ఇందులో నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ మరింత ఆకట్టుకుంది. అందులోని ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ అఘోరా పాత్రలో మెప్పించనున్నాడు. ఇక ‘గామి’ మూవీ మర్చి 8న రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్రం బృందం. అంతేకాకుండా పలు దేవాలయాలను సైతం దర్శించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా విశ్వక్ సేన్.. శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నాడు. ఈరోజు ఉదయం (సోమ‌వారం) ఆలయానికి చేరుకున్న విశ్వక్ సేన్‌ను.. ఆలయ కమిటి స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వక్. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ‘శ్రీశైలంలోని దివ్య క్షేత్రం పట్టణంలో ‘శివం’ పాటను లాంచ్ చేయడానికి గామి బృందం సిద్ధంగా ఉంది. ఈరోజు సాయంత్రం 4:05 గంట‌ల‌కు ఈ సాంగ్‌ను విడుద‌ల చేయ‌నున్నాం’ అంటూ తెలిపింది ట్వీట్ చేసింది చిత్ర బృందం.

Next Story