భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద స్వాతంత్ర్య దినోత్సవ చిత్రంగా ‘గదర్ 2’..

by Disha Web Desk 7 |
భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద స్వాతంత్ర్య దినోత్సవ చిత్రంగా ‘గదర్ 2’..
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో సన్నీ డియోల్, దర్శకుడు అనిల్ శర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘గదర్ 2’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 11న రిలీజై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే.. నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘గదర్ 2’ కలెక్షన్లు రికార్డులు సృష్టించింది. నిన్న మొత్తం షోలు హౌస్ ఫుల్‌ కాగా.. రూ. 55 కోట్లు రాబట్టి భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద స్వాతంత్ర్య దినోత్సవ చిత్రంగా నిలిచింది. కాగా.. మొదటి 4 రోజుల్లో భారతదేశంలో రూ.173.58 కోట్లు రాబట్టింది. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఐదవ రోజున రూ. 55 కోట్లు వసూలు చేసి.. టోటల్ రూ. 229.08 కోట్ల గ్రాస్‌కు చేరుకుంది.

Read More: విజయ్“లియో”సెన్సేషనల్.. వరల్డ్‌ వైడ్ టోటల్ బిజినెస్ ఎంతంటే..

Next Story

Most Viewed