- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ.. బిగ్ అప్డేట్ ఇచ్చిన శివాత్మిక
స్టార్ హీరో రాజశేఖర్ కూతురిగా ‘దొరసాని’ సినిమాతో శివాత్మిక (Shivathmika Rajashekar)హీరోయిన్‌గా పరిచయం అయి పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ అనిపించుకోలేకపోయింది.

దిశ, సినిమా: స్టార్ హీరో రాజశేఖర్ కూతురిగా ‘దొరసాని’ సినిమాతో శివాత్మిక (Shivathmika Rajashekar)హీరోయిన్‌గా పరిచయం అయి పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ అనిపించుకోలేకపోయింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీలో నటిస్తోంది. ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఆరోమలే’ (Aaromaley)ఒకటి. . సారంగ్ థ్యాగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిషన్ దాస్ (kishan das), శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్నారు. హర్ష నాథ్ ఖాన్, వీ టీవీ గణేష్, మేఘా ఆకాష్ కీలక పాత్రలో కనిపించనుండగా.. మిని పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్‌లోకి రానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కంటెంట్ పెంచుకునే ప్రయత్నంలో భాగంగా మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, శివాత్మిక రాజశేఖర్ ‘ఆరోమలే’ ట్రైలర్ రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది.. అక్టోబర్ 29న సాయంత్రం 5 గంటలకు మీ ముందుకు రాబోతోందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది.






