ఇక నుంచి వాళ్ల కాళ్లపై పడతా.. Raghava Lawrence కీలక ప్రకటన

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-19 06:30:55  IST  )

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు..Latest Telugu News

ఇక నుంచి వాళ్ల కాళ్లపై పడతా.. Raghava Lawrence కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్, నటుడిగా దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సినిమాలతో బిజీగా ఉండటమే కాక ఎంతో మంది అనాథలకు అండగా.. నిలబడుతూ గొప్ప మనస్సు చాటుకుంటున్నాడు. తాజాగా, రాఘవ లారెన్స్ తన ట్విట్టర్ ద్వారా ఓ కీలక ప్రకటన చేశాడు.

''నా జీవితంలో ఇది ఒక మార్పు. ఇక నుంచి నేను ఎవరికి సహాయం చేసినా.. వాళ్లు నా పాదాలపై పడకూడదని భావిస్తాను. వారి పాదాలపై పడి సేవ చేస్తాను. నాలో ఈ ఒక్క చిన్న మార్పు తీసుకురావాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఆ దిశగా ఈరోజే తొలి అడుగు వేస్తాను. ఇప్పటివరకు ధనవంతుల కాళ్లపై పడి పేదలు సాయం కోరడం చూశాను. ఇక నుంచి నేను ఇలాంటి సంఘటనలు చూడాలని అనుకోవట్లేదు. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు కారణం. అందుకే ఇక నుంచి నేను ఓ నిర్ణయానికి వచ్చాను. సాయం అడిగిన వాళ్లకు మనం డబ్బు మాత్రమే ఇస్తున్నాం.. అయితే డబ్బు ఇచ్చి దేవుళ్లు కాలేము. ఇక నుంచి నేను సహాయం చేసేవారి పాదాల చెంతకు నేను వెళ్లి సేవ చేస్తాను. మార్పు నా నుంచే ప్రారంభం కావాలి. ఇందుకు మీ అందరి దీవెనలు కావాలి. ఇందుకు సంబంధించిన వీడియోను త్వరలో విడుదల చేస్తాను''. అంటూ ఓ బాలుడి కాళ్లపై పడిన ఫొటోను షేర్ చేశాడు. దీంతో నెట్టింట రాఘవపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story