గ్లామర్ డాల్ నుండి ఫ్యామిలీ గర్ల్ వరకు.. దిగ్గజ డైరెక్టర్‌తో శార్వరి కొత్త ప్రయోగం!

by Mallepaka Hamsa |

ఫ్యామిలీ సినిమాల స్పెషలిస్ట్ సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో రాబోతున్న ‘యే ప్రేమ్ మోల్ లియా’ లో శార్వరి హీరోయిన్‌గా ఎంపికైంది.

గ్లామర్ డాల్ నుండి ఫ్యామిలీ గర్ల్ వరకు.. దిగ్గజ డైరెక్టర్‌తో శార్వరి కొత్త ప్రయోగం!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ శార్వరి యశ్ రాజ్ ఫిల్మ్స్ వంటి పెద్ద బ్యానర్స్ ద్వారా పరిచయమై, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంది. ఒకవైపు నేటి తరం యువతను ఆకట్టుకునే గ్లామర్ పాత్రలు, మరోవైపు తన డ్యాన్స్‌తో సోషల్ మీడియాను ఊపేసే టాలెంట్.. ఇవన్నీ కలిపి శార్వరిని బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మార్చేశాయి. స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా, తనకంటూ సోలో మార్కెట్‌ను కూడా సెట్ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి సిద్ధమైంది. స్టార్ హీరోయిన్ అలియా భట్‌తో కలిసి శార్వరి ‘ఆల్ఫా’లో ఒక పవర్ ఫుల్ స్పై గూఢచారి పాత్రలో కనిపించబోతోంది.

అలాగే దిల్‌జిత్ దోసాంజ్ సరసన శార్వరి ‘మై వాపస్ ఆవుంగా’ చిత్రంలో రొమాన్స్ చేయనుంది. ఇక ఇప్పుడు ఏకంగా దిగ్గజ దర్శకుడు సూరజ్ బర్జాత్యా కంటపడింది. బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు శార్వరి సిద్ధమైపోయింది. ఫ్యామిలీ సినిమాల స్పెషలిస్ట్ సూరజ్ బర్జాత్యా దర్శకత్వంలో రాబోతున్న ‘యే ప్రేమ్ మోల్ లియా’ లో శార్వరి హీరోయిన్‌గా ఎంపికైంది. రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్ అంటేనే పద్ధతైన చిత్రాలు, మంచి పాటలకు పెట్టింది పేరు. అలాంటి పెద్ద బ్యానర్‌లో శార్వరికి అవకాశం రావడం ఆమె కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆమె తొలిసారిగా ఆయుష్మాన్ ఖురానా సరసన సంప్రదాయబద్దమైన పాత్రలో నటించబోతోంది.

అయితే ఈ మూవీ 2026, నవంబర్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఒకవైపు అలియా భట్‌తో కలిసి ఫైట్లు చేస్తూ, మరోవైపు సూరజ్ బర్జాత్యా సినిమాలో పద్ధతైన అమ్మాయిగా కనిపిస్తూ శార్వరి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. యాక్షన్, లవ్, ఫ్యామిలీ.. ఇలా అన్ని రకాల సినిమాలతో శార్వరి 2026లో బాక్సాఫీస్ వద్ద తన జెండా పాతడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె సినిమాలకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శార్వరి తన కెరీర్‌ను చాలా ప్లాన్డ్‌గా ముందుకు తీసుకెళ్తోంది. ఈ సినిమాలన్నీ సక్సెస్ అయితే, బాలీవుడ్‌లో శార్వరికి తిరుగులేని స్టార్‌డమ్ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story