అక్కినేని ఇంట్లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-04 08:21:49  IST  )

అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.

అక్కినేని ఇంట్లోకి చొరబడిన నలుగురు వ్యక్తులు
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఇప్పటికీ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆయన గత కొద్ది కాలంగా మన్మధుడిగా అమ్మాయిల మనసులు గెలుచుకుంటున్నారు. ఇక ఇటీవల ‘కుబేర’(Kubera)చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ధనుష్, రష్మీక, నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం నాగార్జున ‘కూలీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా నటిస్తుండగా.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నాగార్జున సినిమాల విషయం పక్కప పెడితే ఆయన ఇంట్లోకి ఓ నలుగురు వ్యక్తులు చొరబడినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వారిని చూసిన అమల(amala) బయటకు పంపించి తనే వచ్చి వారితే ముచ్చటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అక్కనేని కుటుంబం స్పందించింది. ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది. link

Next Story