జబర్దస్త్ షోలో స్టేజ్ పై బుల్లెట్ భాస్కర్ చేసిన పనికి.. షో నుంచి వెళ్లిపోయిన ఖుష్బు

by Disha Web Desk 10 |
జబర్దస్త్ షోలో స్టేజ్ పై బుల్లెట్ భాస్కర్ చేసిన పనికి.. షో నుంచి వెళ్లిపోయిన ఖుష్బు
X

దిశ, సినిమా: బుల్లితెరపై మంచి ఫామ్ లో దూసుకుపోతున్న షో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. కానీ ప్రజంట్ ఈ షో రేటింగ్ గతంతో పోల్చి చూస్తే తగ్గిపోయింది. అయినప్పటికీ ఈ షోను అభిమానించే వారు ఎంతోమంది ఉన్నారు. అయితే తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ గుండు చేయించుకోవడం హాట్ టాపిక్ అయిపోయింది. విషయం ఏంటి అంటే బుల్లెట్ భాస్కర్.. మహేష్ బాబు ‘నిజం’ సినిమా స్పూఫ్ చేశాడు. మహేష్ పాత్రలో జబర్దస్త్ నరేష్, తల్లి పాత్రలో ఫైమా చేయగా, గోపీచంద్ పాత్రలో బుల్లెట్ భాస్కర్ చేశాడు.

అయితే జడ్జి కృష్ణ భగవాన్ మాట్లాడుతూ గోపీచంద్ గారు పెద్దమ్మ తల్లి దగ్గరకు వెళ్లినప్పుడు అతనికి గుండు ఉంటుంది కదా అని అడిగాడు.. దీంతో బుల్లెట్ భాస్కర్ ‘మధ్యలో గుండు సెటప్ అంటే కష్టం’ అని అన్నాడు. ఇంతలోనే ఖుష్బు ‘స్కిట్ ప్లాన్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా ఉండాలి కదా. ఫీల్ రావడానికి ఏం లేదు కదా మరీ’ అని కామెంట్ చేయగా ‘నేను స్కిట్ కోసం ప్రాణం ఇస్తా. అలాంటిది జుట్టు పెద్ద ఇంపార్టెంట్ కాదు’ అంటూ స్టేజ్ పైనే బుల్లెట్ భాస్కర్ గుండు చేయించుకున్నారు. దీంతో ఆమె ‘జడ్జిగా మా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేనప్పుడు అక్కడ మేము ఉండి ఏం లాభం’ అంటూ షో నుంచి వెళ్లిపోయింది.



Next Story

Most Viewed