- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్ సినీ చరిత్రలో ఫస్ట్ టైమ్..!
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab).

దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది రాజా సాబ్’(The Raja Saab). ఈ చిత్రాన్ని హారర్ కామెడీ జానర్‌లో దర్శకుడు మారుతి (Maruthi)తెరకెక్కించారు. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ఈ నెల 9న ‘రాజా సాబ్’ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమాలోని ‘నాచె నాచె’ సాంగ్‌ను ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ బాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. ‘రాజా సాబ్’లోని ఫన్, కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. జరీనా గారు ఈ సినిమాలో కీ రోల్ చేశారు. ప్రభాస్, జరీనా గారి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగుంటాయి.
అలాగే బొమన్ ఇరానీ గారు కీ రోల్ చేసి మా సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లారు. మా హీరోయిన్స్, డైరెక్టర్ మారుతి గారు, తమన్ అందరికీ థ్యాంక్స్. హిందీలోకి మా సినిమాను తీసుకొస్తున్న అనిల్ కడానీ గారికి థ్యాంక్స్. మా సినిమా సెట్స్ మీద ఉండగానే కల్కి, సలార్ రిలీజ్ అయ్యాయి. దాంతో మా సినిమా స్కేల్ పెంచి మరింత భారీగా నిర్మించాం. 36 వేల స్క్వేర్ ఫీట్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటిదాకా చేయని బిగ్గెస్ట్ ఇండోర్ సెట్ వేసి చేశాం. లార్జెస్ట్ వీఎఫ్ఎక్స్ కూడా మా మూవీలో చూస్తారు. ప్రభాస్ ఇమేజ్‌కు తగినట్లుగా ఉండాలనే సంజయ్ దత్ గారిని తాత క్యారెక్టర్‌కు తీసుకున్నామని చెప్పుకొచ్చారు.






