పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా మంగ్లీ!

by Disha Web Desk 7 |
పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా మంగ్లీ!
X

దిశ, సినిమా: ప్రముఖ గాయని మంగ్లీ తనదైన గాత్రంతో అద్భుతంగా పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కెరీర్ బిగినింగ్‌లో న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పని చేసిన ఆమె ఆ తర్వాత జానపద గీతాలతో పాపులారిటీ సంపాదించుకుంది. అలా మెల్లగా సినిమాల్లో పాటలు పాడుతోంది. ఇదిలావుంటే.. ఇప్పుడు హీరోయిన్‌గా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కన్నడ డైరెక్టర్ చక్రవర్తి చంద్రచూడ్ తెరకెక్కించబోతున్న 'పాదరాయ' సినిమాలో మంగ్లీ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. నాగ శేఖర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2013-14 మధ్య కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించనున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed